Advertisementt

కామ్ గా ఓటిటిలో ప్రత్యక్షమైన శాకుంతలం

Thu 11th May 2023 10:55 AM
samantha,shaakuntalam  కామ్ గా ఓటిటిలో ప్రత్యక్షమైన శాకుంతలం
Shaakuntalam streaming now OTT కామ్ గా ఓటిటిలో ప్రత్యక్షమైన శాకుంతలం
Advertisement
Ads by CJ

శాకుంతలం సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ అని చెప్పుకునే స్థాయిలో ఆ సినిమా రిజల్ట్ ని ప్రేక్షకులు డిసైడ్ చేసారు. సమంత శకుంతల పాత్రలో తేలిపోయింది. గుణశేఖర్ దర్శకత్వం.. గ్రాఫిక్స్ వర్క్ అన్ని శాకుంతలం ప్లాప్ లో ప్రధాన హైలెట్ గా నిలిచాయి. దిల్ రాజు తన కెరీర్ లోనే శాకుంతలం బిగ్గెస్ట్ జర్క్ అంటే ఆ సినిమాకి ఎంత ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయో అర్ధమవుతుంది.

థియేటర్స్ లో ఏప్రిల్ 14 న ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఏప్రిల్ 12 న ఉంటుంది అని అంచనా వేశారు. అదే తేదీని శాకుంతలం డిజిటల్ పార్ట్నర్ అమెజాన్ వారు ప్రకటించారు. కానీ అమెజాన్ ప్రైమ్ వారు ఎప్పటికప్పుడు తమ ఓటిటిలో విడుదలయ్యే సినిమాల్ని చడీ చప్పుడు కాకుండా రిలీజ్ చేసినట్టుగానే శకుంతలాన్ని కామ్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. 

ఏప్రిల్ 12 కన్నా ఒక్కరోజు ముందే అంటే ఈరోజు నుండే అమెజాన్ ప్రైమ్ లో శాకుంతలం ఓటిటి ఆడియన్స్ అందుంబాటులోకి వచ్చేసింది. చాలా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో శాకుంతలం స్ట్రీమింగ్ అవుతుంది. నేటి నుండి అంటే ఏప్రిల్ 11 నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కి శాకుంతలం అందుబాటులోకి వచ్చేసింది.

Shaakuntalam streaming now OTT:

Samantha Shaakuntalam is now streaming on OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ