Advertisementt

భార్యతో విడాకుల రూమర్స్ కి పూరి చెక్

Wed 10th May 2023 08:30 PM
puri jagannadh  భార్యతో విడాకుల రూమర్స్ కి పూరి చెక్
Puri Jagannadh Performs Pooja with Family భార్యతో విడాకుల రూమర్స్ కి పూరి చెక్
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య తో కలిసి ఉండడం లేదు.. నిర్మాత కమ్ మాజీ హీరోయిన్ ఛార్మి తో పూరి కలిసి ఉంటూ భార్య లావణ్యని పట్టించుకోవడం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో ఎప్పటినుండో ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పూరి.. తన భార్యతో సఖ్యతగా ఉండడం లేదు అంటూ ప్రచారంలో ఉన్న వార్త. కానీ మధ్యలో పూరి జగన్నాథ్ కి లావణ్యకి మధ్యలో ఎలాంటి ప్రోల్మ్స్ లేవంటూ పూరి కొడుకు ఆకాష్ క్లారిటీ ఇవ్వడం, అలాగే భార్య భర్త కలిసి కనిపించడం లాంటివి చూసాం.

లైగర్ డిసాస్టర్ తర్వాత పూరికి భార్య లావణ్యకి మధ్యలో మరోసారి ఈ విడాకుల రూమర్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పూరి జగన్నాథ్ ఎక్కువగా ముంబైలో ఉంటున్నాడు, ఛార్మితో కలిసి గడుపుతూ భార్యకి దూరంగా ఉంటున్నాడు, త్వరలోనే పూరి జగన్నాథ్-లావణ్యలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు ఫ్రెష్ గా మొదలయ్యాయి. 

అవన్నీ జస్ట్ రూమర్స్ అంటూ పూరి జగన్నాథ్ కొట్టిపారెయ్యడం కాదు.. భార్య లావణ్యతో అన్యోన్యంగా ఉన్న పిక్స్ ని షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసాడు. పూరి లావణ్యలు తమ సొంతూరు నర్సి పట్నం వెళ్లి అక్కడ పూరి తన అన్నదమ్ములతో కలిసి హోమం నిర్వహించడం, అలాగే ఫ్యామిలీతో కలిసి సందడి చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అది చూసాక వీరి మధ్యన విడాకులేమిటి అంటూ అందరూ ఆ రూమర్స్ ని కొట్టిపారేస్తున్నారు.

Puri Jagannadh Performs Pooja with Family:

Puri Jagannadh Performs Pooja with his wife

Tags:   PURI JAGANNADH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ