ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16 న విడుదలకాబోతుంది. బాలీవుడ్ దర్శకనిర్మాతల సారథ్యంలో రాబోతున్న ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగిటివిటి ట్రోల్స్ ఏ చిత్రంపైన రాలేదనే చెప్పాలి. ఆఖరుకి ప్రభాస్ ఫాన్స్ కూడా ఆదిపురుష్ టీజర్ ని మెచ్చలేకపోయారు. అయితే నిన్న ఆదిపురుష్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. ఆదిపురుష్ ట్రైలర్ విజువల్ వండర్ అంటూ మీడియా, అభిమానులు మెచ్చుకున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ పై పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. ఓం రౌత్ టీజర్ పై వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ తో ఆల్మోస్ట్ చెరిపినట్లే కనిపిస్తుంది.
అయితే ప్రభాస్ నుండి వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో టాలీవుడ్ నుండి నాని ఇంకా చిన్న చిన్న హీరోలు గొప్పగా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ అంటూ ట్వీట్ చేసారు. కానీ స్టార్ హీరోలెవరూ సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో స్పందించలేదు. ఆఖరుకి రాజమౌళి నుండి కూడా ఆదిపురుష్ ట్రైలర్ పై ఎలాంటి ట్వీట్ పడలేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ కడుపు మండిపోతుంది. వారు టాలీవుడ్ నుండి ప్రభాస్ కి సపోర్ట్ దొరకడం లేదు అంటూ తెగ ఫీలైపోతున్నారు.
ఏ ఒక్క Tier-1 Hero Kuda Tweet చేయలేదు #AdipurushTrailer పైన SSR కూడ చేయలేదు, ఎందుకురా మీకు ఇంత ఏడుపు ఆయన పైన 🙏#Prabhas𓃵 🙏👑🔥 అంటూ సోషల్ మీడియాలో హీరోలని తిట్టుకుంటూ వారి బాధని వెళ్లగక్కుతున్నారు.