టాలీవుడ్ స్టార్స్ అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమాన గణం కూసింత ఎక్కువే. ఆయన సినిమాల్లో బ్రేక్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాగే రెమ్యునరేషన్ పరంగాను పవన్ కళ్యాణ్ తర్వాతే వేరే హీరోలు అన్నట్టుగా ఉంది టాలీవుడ్ వ్యవహారం. అయితే పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో ఎంత సపోర్ట్ ఉందో అనేది ఇంకా అంతుబట్టని ప్రశ్నే. సినిమాల్లో సపోర్ట్ చేసే ఫాన్స్ ఆయన్ని రాజకీయాల్లో కూడా సపోర్ట్ చేస్తే ఈపాటికే స్ట్రాంగ్ రాజకీయనాయకుడయ్యేవారు పవన్ కళ్యాణ్. కానీ ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ దెబ్బేస్తున్నారు.
అయినప్పటికీ ఆయన రోడ్డు మీదకొస్తే ప్రభంజనమే అన్నట్టుగా జన సందోహం కనిపిస్తుంది. తాజాగా ఆయన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు హైదరాబాద్ నుండి రాజమండ్రి మీదుగా పలు గ్రామాలకు వెళ్లారు. నిన్న OG లాంగ్ షెడ్యూల్ పూణే లో ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇమ్మిడియట్ గా ఈరోజు బుధవారం ఉదయమే రాజమహేంద్రవరానికి ఫ్లైట్ లో వెళ్లి అక్కడినుండి ర్యాలీగా కడియపు లంక చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ కి పది వేల బైకులతో ఫాన్స్ ర్యాలీ చేపట్టారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అడుగడునా జననీరాజనాలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ కారులో వెళుతుంటే ఆయన వెనుక పది వేల బైకులతో అభిమానులు ర్యాలీగా వెళ్లడం చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ప్రభంజనమే అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.