Advertisementt

ఆసుపత్రిలో 30 ఇయర్స్ పృథ్వి

Wed 10th May 2023 02:30 PM
prudhvi raj  ఆసుపత్రిలో 30 ఇయర్స్ పృథ్వి
30 years Prudhvi in hospital ఆసుపత్రిలో 30 ఇయర్స్ పృథ్వి
Advertisement
Ads by CJ

30 ఇయర్స్ పృథ్వీ గత రెండేళ్లుగా రాజకీయాల్లో తిరిగి తర్వాత వైసీపీ ప్రభుత్వంపై చిర్రెత్తుకొచ్చి బుద్దిగా సినిమాలు చేసుకుంటున్నారు. అలాగే పర్సనల్ లైఫ్ లోను ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసి భార్యతో విడాకులు తీసుకున్న పృథ్వీ ప్రస్తుతం దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రమోషన్స్ లో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. పృథ్వీ ప్రస్తుతం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 

ఆయన అనుకోకుండా కుప్పకూలిపోవడంతో కుటుంభ సభ్యులు వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెలైన్ బాటిల్ తో ఆసుపత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటున్న వీడియోని పృథివీ షేర్ చేస్తూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. 

ఆ వీడియోలో దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్నాను, ఆసుపత్రిలో ఉన్నా ప్రస్తుతం సినిమా గురించే ఆలోచిస్తున్నాను, కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలంటూ పృథ్వీ ఆ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన కండిషన్ నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తుంది.

30 years Prudhvi in hospital:

30 Years Industry Comedian Prudhvi Raj Hospitalised

Tags:   PRUDHVI RAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ