ఆదా శర్మ కీలక పాత్రలో సూదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు ముందే వివాదాస్పదమై.. విడులయ్యాక కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారిన ది కేరళ స్టోరీ చిత్రం ఇప్పటికీ వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ కేరళ, తమిళనాడులో నినాదాలు చేస్తూ మల్టిప్లెక్స్ లో ది కేరళ స్టోరీని ఆడకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ లో ది కేరళ స్టోరీ పై మమతా బెనర్జీ బ్యాన్ విధించారు. అంతేకాకుండా ది కేరళ స్టోరీలో నటించిన వాళ్ళు బయట ఎక్కడ కనిపించినా చంపేస్తామంటూ బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయి.
అయితే విడుదలకు ముందు నుండే ఈ చిత్రంపై వచ్చిన నెగిటివిటి, విడుదలైన తర్వాత వస్తున్న కాంట్రవర్సీలు ఈ చిత్ర ప్రచారానికి బాగా పని చేసాయి. చిన్న సినిమాగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ మూడునాలుగు రోజుల్లోనే 40 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇంత వివాదాస్పదమైన ఈ చిత్రం ఏ ఓటిటిలో విడుదల కాబోతుందో అంటూ ఆడియన్స్ గూగుల్ లో వెతికేస్తున్నారు.
ది కేరళ స్టోరీని ప్రముఖ ఓటిటీ సంస్థ జీ 5 దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ చిత్రం ఎప్పుడు ఓటిటిలో నుండి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టంగానే ఉంది. కానీ ఓ 40 రోజుల్లో అంటే జూన్ రెండో వారంలో ఏమైనా స్ట్రీమింగ్ అవుతుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థియేటర్స్ లో ది కేరళ స్టోరీ సద్దుమణగ్గానే జీ 5 లో ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం దొరుకుంతుందేమో.. చూద్దాం.