జగపతి బాబు ఇప్పుడు ఏ భాషలో చూసినా ఆయన పేరే విలన్ రోల్స్ కి పరిశీలుస్తున్నారు అని చెప్పుకోవడం కన్నా పలు భాషల్లో విలన్ రోల్స్ పోషిస్తూ పాపులర్ అయ్యారు అని చెప్పాలి. తాజాగా కిసి కా భాయ్ కిసి కా జాన్, రామ బాణం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాలు ఆయన్ని బాగా నిరాశపరిచాయి. అయినా సలార్, పుష్ప 2, హిందీ సినిమాలతో క్రేజీ విలన్ గా మారారు. ఈమధ్యన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న జగ్గు భాయ్ రీసెంట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసారు.
ఆ పిక్స్ లో ఆయన ఆవకాయ అన్నం తింటూ దానిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా క్యాప్షన్ పెట్టారు. Ye Desham velina , Saddannamlo, Maa Atha garu icchina aavapindi kalipina avakai pacchadi poddhinney kalupukuni pandhikokku laga thinntunna 😋 ఏ దేశం వెళ్లినా.. సద్దన్నంలో మా అత్తగారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ్ పచ్చడి పొద్దున్నే కలుపుకుని పందికొక్కులా తింటున్నా అంటూ సరదాగా పెట్టిన క్యాప్షన్ ఆయన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.