అఖిల్ కి ఏజెంట్ రూపంలో ఓ భారీ డిసాస్టర్ పలకరించింది. ఏజెంట్ గా మారడానికి అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. డైట్ విషయంలోనే కాదు.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం అఖిల్ జిమ్ లో చేసిన వర్కౌట్స్.. అతని లుక్ లోనే చూపించాడు. మూడేళ్ళుగా ఏజెంట్ కోసం ట్రావెల్ చేసిన అఖిల్ కి ఏజెంట్ మూడు నిమిషాల్లో డిస్పాయింట్మెంట్ ఇచ్చింది. ఏజెంట్ ప్లాప్ తో అఖిల్ సైలెంట్ గా దుబాయికి వెళ్లాడనే మాట వినిపిస్తుంది. అయితే అఖిల్ ఏజెంట్ తదుపరి మూవీపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకి వచ్చేసాయి.
అది సాహో చిత్రానికి దర్శకత్వశాఖలో పని చేసిన అనిల్ కుమార్ తో అఖిల్ నెక్స్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ ప్యాన్ ఇండియా స్టయిల్లోనే ప్రెజెంట్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్-అనిల్ కుమార్ మూవీపై అనౌన్సమెంట్ లేకపోయినా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో నడుస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తాడనే న్యూస్ బాగా వైరల్ గా మారింది.
పీరియాడికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా టాక్. అక్కినేని అఖిల్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా లో అఖిల్ కి KGF రేంజ్ లో ఎలివేషన్స్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఏ మూవీపై అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని సమాచారం.