ఇప్పటివరకు ప్రభాస్ లుక్స్ పై వచ్చే కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ వాయిస్ పై వినిపిస్తున్నాయి. ప్రభాస్ హైట్ కి, వెయిట్ కి, ఆయన రూపానికి, ఆయన నవ్వు, పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పే వాయిస్ బేస్, యాక్టింగ్ ఇలా అన్నిటికి ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని చూసి ఇంప్రెస్స్ అవుతారు. ప్రభాస్ డైలాగ్ డెలివరీకి కూడా ఫిదా అవుతారు. కానీ పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి ప్రభాస్ చాలా కష్టపడుతుంటే.. ఇప్పుడు అదే బరువు ఆయన వాయిస్ ని డామినేట్ చేస్తుందా అనిపించేలా ప్రభాస్ ఆదిపురుష్ లో డబ్బింగ్ వినిపిస్తుంది.
ఆదిపురుష్ టీజర్ తో విమర్శలు పాలైన మేకర్స్.. ట్రైలర్ విషయంలో సక్సెస్ అయ్యారు. అంటే టీజర్ కన్నా బెటర్ గా ట్రైలర్ ఉంది. అది 3D లో ఇంకాస్త అద్భుతం అనిపించేలా ఉంది. భక్తి రామాయణానికి ఇదో మోడరన్ రామాయణ గాధగా ఓం రౌత్ డిజైన్ చేసాడు. ప్రభాస్ లుక్స్, సీతగా కృతి శెట్టి లుక్స్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ కేరెక్టర్ డిజైన్, గ్రాఫిక్స్ అన్ని మెచ్చుకునేలా కనిపించినా.. ప్రభాస్ పలికే ప్రతి మాట బరువుగా, మందంగా వినిపించింది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి.
ఆయన పెరిగిన బరువే ఆయన వాయిస్ ని మార్చేసింది అనే మాట వినిపిస్తుంది. ప్రభాస్ డైలాగ్ డెలివరీలో స్పష్టత లేదు. వాయిస్ లో పవర్ లేదు, గ్రెస్ లేదు.. ఏంటి ప్రభాస్ అంటూ చాలామంది ఆదిపురుష్ ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్ డెలివరీపై కెమెంట్స్ చేస్తుంటే ప్రభాస్ ఫాన్స్ బిక్కసచ్చిపోతున్నారు.