Advertisementt

ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ

Tue 09th May 2023 02:29 PM
prabhas,adipurush  ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ
Adipurush Trailer Review ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన సినిమా ఆదిపురుష్. ఎంతో హైప్ ఉన్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని బాగా డిస్పాయింట్ చేసింది. ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగిటివిటీని పోగొట్టేందుకు బెస్ట్ విజువల్స్ కావాలంటూ మేకర్స్ ఆదిపురుష్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసారు. జూన్ 16 న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా రావణ్ గా నటించారు.. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అంచనాలకు భిన్నంగా ట్రైలర్ ఈ సారి అద్భుతం అనే టాక్ తెచ్చుకుటోంది. ఏ.ఎమ్.బి మాల్ లో జరిగిన ట్రైలర్ ప్రివ్యూ కు మూవీ టీమ్ మొత్తం హాజరైంది. ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. హనుమంతుడి కోణంలో సాగే కథలా ఈ ట్రైలర్ ఆరంభంలోనే కనిపిస్తుంది.  

ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం.. అంటూ హనుమంతుడు చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే భిక్షాందేహీ అంటూ రావణుడు ఎంట్రీ.. సీతను ఎత్తుకుపోవడం కనిపిస్తుంది. సీత తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది. 

ట్రైలర్ ను బట్టి చూస్తే ఆదిపురుష్ రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే చూపించేలా కనిపిస్తోంది. చివర్లో వచ్చిన రామ రావణ యుద్ధానికి నేటి ఆధునిక టెక్నాలజీని జోడించినట్టు కనిపిస్తోంది. ఇది సినిమాకు ప్రధాన బలంగా ఉండే అవకాశం ఉంది. 

విజువల్స్ పరంగా సింప్లీ సూపర్బ్. మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. రాముడు ప్రభాస్, సీతగా కృతి సనన్ జోడీ బావుంది. ఇక 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

Adipurush Trailer Review:

Prabhas Adipurush Trailer Review

Tags:   PRABHAS, ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ