పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో సముద్ర ఖని తెరకెక్కిస్తున్న తమిళ వినోదియం సిత్తం రీమేక్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రాన్ని జులై 28 న విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించేసారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన 22 రోజుల షూటింగ్ పూర్తవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విరూపాక్ష సక్సెస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా డే అండ్ నైట్ #PKSDT షూట్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతుంది.
ఇంతవరకు టైటిల్ ఎనౌన్సమెంట్ లేదు. అయితే రేపు మే 10న #PKSDT నుండి అప్ డేట్ రాబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే #PKSDT టైటిల్ ఇస్తారేమో అంటూ ప్రచారం జరిగే లోపులోనే ఈ చిత్రానికి #BRO టైటిల్ కన్ ఫర్మ్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో కనిపించింది. ఇంతకుముందు ఈ చిత్రానికి దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి #BRO టైటిల్ ని కన్ ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ టైటిల్ నే రేపు బుధవారం ప్రకటిస్తారని.. అలాగే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ భారీ సెట్ లో #PKSDT స్పెషల్ సాంగ్ షూట్ జరగబోతుంది అంటున్నారు. మరి రేపు టైటిల్ తో పాటుగా #PKSDT ఫస్ట్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది అని పవన్ ఫాన్స్ అతృతతో ఉన్నారు.