వైజయంతి మూవీస్ లో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే అశ్విని దత్ గారు ఆయన బ్యానర్ లోనే కూతుళ్లు నిర్మాతలుగా మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలను స్వప్న సినిమాస్ పేరుతొ తెరకెక్కిస్తూ వరసగా హిట్స్ కొడుతున్నారు. అనుదీప్ దర్శకుడిగా నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో జాతి రత్నాలు సినిమా తీసి.. భారీగా ప్రమోట్ చేసి మరీ పాండమిక్ సిట్యువేషన్ ఆడియన్స్ ముందుకు తీసుకురాగా ఆ సినిమా అశ్విని దత్ గారికి కోట్లు తెచ్చిపెట్టింది.
ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. తర్వాత సీతారామం చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వస్తున్న అన్ని మంచి శకునములే నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కూడా స్వప్న, ప్రియాంక దత్ లు డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. జర్నలిస్టులకి విందు భోజనాలంటూ టీమ్ హడావిడి చేస్తుంది.
ప్రమోషన్స్ విషయంలో కొత్తగా కనిపిస్తున్న అన్ని మంచి శకునములే మరో జాతిరత్నం అవుతుందా.. చిన్న దర్శకులని, కొత్త కథలని నమ్మి, వారిని ఎంకరేజ్ చేస్తూ తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించి భారీ హిట్స్ కొట్టి కలెక్షన్స్ పరంగా కోట్లు కొల్లగొడుతున్న అశ్విని దత్, ఆయన కూతుళ్ళకి అన్ని మంచి శకునములే జరగాలని కోరుకుందాం.