నాగ చైతన్య-సమంతలు కొన్నేళ్లు ప్రేమించుకుని తర్వాత పెద్దల అనుమతితో ప్రేమ వివాహం కూడా అంగరంగ వైభవముగా చేసుకున్నారు. హిందీ, క్రిష్టియన్ సంప్రదాయాల పద్డతిలో పెళ్లి చేసుకున్న సమంత-చైతులు నాలుగేళ్లు లవ్ బర్డ్స్ లా, క్యూట్ కపుల్ గా కలిసి ఉన్నారు. కానీ నాలుగేళ్ళ వివాహ బంధాన్ని విడాకుల పేరుతో వేరు చేసుకుంది ఈ జంట. ఈ నాలుగేళ్లలో చైతు సమంతలు చాలా సంతోషంగానే ఉన్నారు. భార్య భర్తల అనుబంధంలో పొరపొచ్చాలు రావడం సహజమే. కానీ.. అవి సర్దుకోకపోతే విడాకులతో వేరేవ్వాలి.
అయితే నాగ చైతన్య ఒకలా, సమంత మరోలా ఈ విడాకుల విషయంలో స్పందించారు. తాజాగా కష్టడి ప్రమోషన్స్ లో నాగ చైతన్య సమంత మంచి అమ్మాయి. తాను డేరింగ్ అమ్మాయి అంటూ పాజిటీవ్ గా స్పందించడమే కాదు.. ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంతలో హార్డ్ వర్కింగ్ స్టయిల్ నచ్చుతుంది అని.. ఆమె కష్టపడే తత్త్వం ఇష్టమంటూ చెప్పాడు. యాంకర్ మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ లో లైక్ పూజ హెగ్డే లో ఏమిష్టం అనగానే ఆమె స్టయిల్ అన్న చైతు.. సమంతలో ఆమె హార్డ్ వర్కింగ్ అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే కృతి శేట్టిలో ఇన్నోసెన్స్ నచ్చుతుంది అంటూ తనతో పని చేసిన హీరోయిన్స్ విషయంలో సమంత విషయాన్ని కూడా చాలా క్యాజువల్ గా బయటపెట్టేసాడు.