Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్

Mon 08th May 2023 07:56 PM
jr ntr  ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్
Biggest surprise for NTR fans ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత బర్త్ డే కి కొరటాల శివ నుండి #NTR30 వీడియో గ్లిమ్ప్స్ తో పాటుగా ప్రీ లుక్ పోస్టర్ వచ్చింది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోతున్న #NTR31 నుండి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలి ఎన్టీఆర్ ఫాన్స్ కి మరిచిపోలేని సర్ ప్రైజ్ లు ఇచ్చారు. మరి సినిమా అనౌన్సమెంట్స్ కే ఎన్టీఆర్ బర్త్ డే కి ఫాన్స్ ఆ విధమైన ట్రీట్స్ తో ఎంజాయ్ చేస్తే.. ఈ ఏడాది #NTR30 షూటింగ్ మొదలైపోయింది.

ఎన్టీఆర్ బర్త్ డే కి మరో పది రోజుల సమయమే ఉంది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్30 నుండి కొరటాల ఇవ్వబోయే ట్రీట్ పై అందరిలో సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. కొరటాల #NTR30 నుండి ఎలాంటి స్పెషల్ ట్రీట్ ఇస్తాడో అని ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం #NTR30 ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ వీడియో మోషన్ పోస్టర్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా హైలైట్ గా నిలవబోతుంది అంటున్నారు.  

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న #NTR30 చిత్రీకరణలో కొరటాల బిజీ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, కథ నేపథ్యానికి తగ్గట్టే ఎన్టీఆర్ పాత్రను కూడా చాలా పవర్ ఫుల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కోలీవుడ్ సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Biggest surprise for NTR fans:

Jr NTR birthday plans

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ