Advertisementt

నయనతార స్వీట్ అండ్ లవ్లీ: షారుఖ్‌

Mon 08th May 2023 04:56 PM
shah rukh khan,jawan  నయనతార స్వీట్ అండ్ లవ్లీ: షారుఖ్‌
Nayanthara is sweet and lovely: ShahRukh నయనతార స్వీట్ అండ్ లవ్లీ: షారుఖ్‌
Advertisement
Ads by CJ

పఠాన్‌ సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయిన జోష్‌లో ఉన్నారు షారుఖ్‌ ఖాన్‌. అదే జోరులో యాక్షన్‌ ప్యాక్డ్ జవాన్‌ షూటింగ్‌లో పార్టిసిపేట్‌ చేస్తున్నారు. మాస్‌ ఆడియన్స్ పల్స్ పక్కాగా తెలిసిన డైరక్టర్‌ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పర్ఫెక్ట్ కాంబో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే ఉండదూ అంటూ జనాలు ఆత్రుతగా వెయిట్‌ చేస్తున్న జవాన్‌ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా షారుఖ్‌ తన జవాన్‌ గురించి ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. 

ట్విట్టర్‌లో ఆస్క్ ఎస్‌ఆర్‌కె అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ముచ్చటించారు షారుఖ్‌. జవాన్‌ సినిమా షురూ అయినప్పటి నుంచి రిలీజ్‌ డేట్‌ వరకు ఎన్నో విషయాలను పంచుకున్నారు షారుఖ్‌. జవాన్‌ రిలీజ్‌ డేట్‌ వాయిదా పడటం గురించి షారుఖ్‌ స్పందిస్తూ ప్రేక్షకుల మనసుకు నచ్చేలా, వారికి అద్భుతమైన వినోదాన్ని అందించేలా సినిమా చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కొన్నిసార్లు వేచి ఉండటం వల్ల కూడా అద్భుతాలను ఆస్వాదించవచ్చు. జవాన్‌ కోసం అందరూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. హద్దులు దాటి అహర్నిశలూ కృషి చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయడం వల్ల ఇంకాస్త వెసులుబాటుతో పనిచేస్తారు అని అన్నారు. 

జవాన్‌ లో తనకు నచ్చిన అంశాలను గురించి ప్రస్తావించారు షారుఖ్‌. నాకు ఇది సరికొత్త జోనర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే అట్లీ స్పెషల్‌. రెండు వైవిధ్యమైన బాణీలను కలిపి జతచేసి పరుగులు తీయించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లీ, అతని టీమ్‌  చాలా మాస్‌గా ఉన్నారు. ఆ మాస్‌ నాకు నచ్చింది అని చెప్పారు. 

పోస్టర్‌లో షారుఖ్‌ ఎందుకు లేరు? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు కింగ్‌ ఖాన్‌. నా పోస్టర్‌ కాదు, నా పేరు చాలని ఫిక్సయ్యారు మేకర్స్ అని అన్నారు. సహ నటుల గురించి మాట్లాడుతూ నయనతార లవ్లీ పర్సన్‌. చాలా స్వీట్‌. ఆమెతో పనిచేయడం చాలా మంచి అనుభూతి. ప్లెజర్‌ అని అన్నారు. విజయ్‌ సేతుపతి నిరాడంబరమైన వ్యక్తి అని అన్నారు. బ్రిలియంట్‌ యాక్టర్‌ అని ప్రశంసించారు. విజయ్‌ దగ్గర చాలా విషయాలను నేర్చుకున్నట్టు తెలిపారు బాద్షా. 

అట్లీ మీకు తమిళ్‌ నేర్పారా అని అడగ్గా అట్లీ, అనిరుద్‌ కలిసి ఓ పాటలో నాతో కొన్ని లైన్లు లిప్‌ సింక్‌ చేయించారు. తమిళ్‌లో పాడాను. అవి బావుంటాయని నమ్ముతున్నాను అని అన్నారు. ఈ ఏడాది అత్యంత భారీ యాక్షన్‌ చిత్రంగా విడుదల కానుంది జవాన్‌. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరర్మిస్తోంది. 2023, సెప్టెంబర్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది జవాన్‌.

Nayanthara is sweet and lovely: ShahRukh:

Shah Rukh Khan reveals why he took the decision to postpone Jawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ