Advertisementt

ప్రెగ్నెన్సీ రూమర్స్: రానా వైఫ్ మిహిక స్పందన

Mon 08th May 2023 12:24 PM
rana daggubati,miheeka  ప్రెగ్నెన్సీ రూమర్స్: రానా వైఫ్ మిహిక స్పందన
Pregnancy rumours: Rana wife Miheeka reacts ప్రెగ్నెన్సీ రూమర్స్: రానా వైఫ్ మిహిక స్పందన
Advertisement
Ads by CJ

రానా కరోనా సమయంలో మిహికాని సింపుల్ గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ, కొద్దిమంది ఫ్రెండ్స్, మిహిక బజాజ్ ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన అంగరంగ వైభవంగా రానా-మిహికల వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత ఈ లవ్లీ కపుల్ జంటగా ఎక్కడ కనిపించినా అభిమానులు చాలా థ్రిల్ ఫీలవుతూ ఉంటారు. రానా సినిమాలతో బిజీగా కనిపిస్తున్నాడు. కొద్దిరోజులుగా రానా-మిహిక తల్లితండ్రులు కాబోతున్నారు, మిహిక ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా మిహిక తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించింది. తాను ఈమధ్యన కొద్దిగా బరువు పెరిగాను, బొద్దుగా కనిపిస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను తల్లిని కావడం లేదు. ప్రస్తుతం వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను కొద్దిగా లావుగా కనిపిస్తున్నాను తప్ప ప్రెగ్నెంట్ ని కాదు. నేను గనక తల్లినవుతున్నాను అంటే ఆ శుభవార్తని ముందుగా మీతోనే పంచుకుంటాను అంటూ మిహిక తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించింది.

ఇక మిహికాని సినిమాల్లో నటిస్తారా అని అడగ్గానే తనకి అసలు యాక్టింగ్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నటించను అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

Pregnancy rumours: Rana wife Miheeka reacts:

Rana Daggubati wife Miheeka reacts on pregnancy rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ