ప్రభాస్ లుక్ విషయంలో ఫాన్స్ నుండి బోలెడన్ని కంప్లైంట్స్. ఆయన హెయిర్ స్టయిల్ విషయంలోనూ అంతే. బాహుబలి తర్వాత భారంగా బరువుగా కనిపిస్తున్న ప్రభాస్ ఎంతగా స్లిమ్ అవ్వడానికి వర్కౌట్స్ చేస్తున్నా ఆయన బరువు తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఆయన ఎక్కడైనా కొద్దిగా స్లిమ్ గా కనిపిస్తే చాలు ఆయన ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అప్పుడు పండగ చేసుకుంటారు. వరసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్ లుక్ విషయంలో విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి.
అయితే ముంబైలో గత ఏడాది ఓం రౌత్ పార్టీలో ప్రభాస్ కొద్దిగా స్లిమ్ గా స్టయిల్ గా కనిపించేసరికి ప్రభాస్ ఫాన్స్ ఊగిపోయారు. మళ్ళీ తరవాత యధామామూలే అన్నట్టుగా కనిపించారు. తాజాగా ప్రభాస్ లేటెస్ట్ స్లిమ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైట్ షర్ట్ లో ప్రభాస్ సన్నగా నాజూగ్గా కనిపించేసరికి ఫాన్స్ ఆ పిక్ ని తెగ ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇది కదా మాకు కావాల్సింది బ్రో అంటూ ప్రభాస్ పిక్ ని చూసి ఆనందపడిపోతున్నారు.
ప్రభాస్ రాజు గారు మీరిలానే మెయింటింగ్ చెయ్యండి.. మిమ్మల్ని కొట్టే హీరో మరొకరుండరు అంటూ ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ K, రాజా డీలక్స్ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉండగా.. ఇకపై ఆయన ఆదిపురుష్ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లాల్సి ఉంటుంది. ఆదిపురుష్ జూన్ 16 న విడుదలకు సిద్దమవుతుంది. రేపు ఆదిపురుష్ ట్రైలర్ రాబోతున్న విషయం తెలిసిందే.