సూపర్ స్టార్ రజినీకాంత్ కి పర్ఫెక్ట్ దర్శకుడు దొరకడం లేదు కానీ.. లేదంటే సూపర్ స్టార్ రేంజ్ బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేంత ఎత్తులో ఉండేది. గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ వరసగా ఫెయిల్యూర్స్ ని చవి చూస్తున్నారు. అయినప్పటికీ ఆయన నుండి కొత్త సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులు ఆఫీస్ లకి సెలవు పెట్టి మరీ థియేటర్స్ వైపు పరుగులు తీస్తారు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ మూవీలో నటిస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ ని పవర్ ఫుల్ యాక్షన్ ఫిలిం గా ప్రెజెంట్ చేస్తున్నాడు. జైలర్ మూవీ ఆగష్టు 10న విడుదల అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక రజినీకాంత్ ఇప్పుడు లాల్ సలామ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆయన కుమర్తె ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ లో కీ రోల్ పోషిస్తున్నారు. నిన్న ఆదివారమే లాల్ సలామ్ షూటింగ్ కోసం రజినీకాంత్ ముంబై వెళ్లారు. అంతలోనే లాల్ సలామ్ నుండి రజిని ఫస్ట్ లుక్ వచ్చేసింది.
అప్పట్లో బాషా భాయ్ గా పవర్ ఫుల్ లుక్ తో స్టయిల్ తోనే సంచలనం సృష్టించిన రజినీకాంత్ ఇప్పుడు మొయిద్దీన్ భాయ్ గా లాల్ సలామ్ లో పవర్ ఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్ ముస్లిం గెటప్ లో ఇరగదీసారు. ప్రస్తుతం రజిని లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.