యాంకర్ నుండి యాక్ట్రెస్ గా మారిపోయిన అనసూయ జబర్దస్త్ షో తోనే బాగా పాపులర్ అయ్యింది. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం తో హైలెట్ అయ్యి వెండితెర మీద అవకాశాలు అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం ప్యాన్ ఇండియా మూవీస్ లో సందడి చేస్తుంది. తనకెంతో పేరు, డబ్బు తెచ్చిపెట్టిన జబర్దస్త్ నుండి అనసూయ గత ఏడాది తప్పుకుంది. దాదాపుగా ఎనిమిదేళ్ళుగా జబర్దస్త్ యాంకర్ గా మెస్మరైజ్ చేసిన అనసూయ అందాలను ఇప్పుడు కామెడీ ప్రియులు బాగా మిస్ అవుతున్నారు.
ఇక భర్త సపోర్ట్ తో యాంకరింగ్ లోను, నటనపై దృష్టి పెట్టిన అనసూయ భర్త భరద్వాజ్ తో కలిసి ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే కొంతకాలంగా అనసూయ ఫిట్ నెస్ విషయంలో విమర్శలు మొదలయ్యాయి. ఆమె ఫిట్ నెస్ పట్టించుకోవడం లేదు, కాస్త బరువు పెరిగి భారంగా కనిపిస్తుంది అనే కామెంట్స్ పడుతున్నాయి. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నట్టుగా ఎప్పటికప్పుడు ఆమె పిక్స్ తో తెలియజేస్తున్నా అందరిలో ఏవో అనుమానాలే.
ఇక ఈ రోజు ఆదివారం కావడంతో భర్త భరద్వాజ్ తో కలిసి జిమ్ లో వర్కౌట్స్ తో కుమ్మేసిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిమ్ వేర్ డ్రెస్ లో అనసూయ అందాలు చూపించేస్తూనే భర్త భరద్వాజ్ తో కలిసి సన్ డే వర్కౌట్స్ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పిక్స్ షేర్ చేసింది. అనసూయ జిమ్ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.