హీరో గోపీచంద్ టైం అసలు బాగోలేదు. తనకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా ఇప్పుడు ఘోరమైన డిసాస్టర్ ఇచ్చాడు. గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ కొట్టిన గోపీచంద్-శ్రీవాస్ జోడి ఇప్పుడు రామ బాణం తో డిసాస్టర్ చవి చూసారు. ఇక మొన్నామధ్యన మారుతీ తో చేసిన పక్కా కమర్షియల్ కూడా గోపిచంద్ కి షాక్ తగిలేలా చేసింది. ఇప్పడు రామ బాణం కూడా ప్లాప్ అవడంతో మూస కథలతో ఇంకెన్నాళ్లు కుస్తీ పడతావ్ గోపీచంద్ కొత్త కథలని ఎంచుకోమంటూ నెటిజెన్స్ సలహాలు ఇస్తున్నారు.
జగపతి బాబు-గోపీచంద్ హీరో విలన్ గా చేసిన ఆక్సిజెన్ ఎంతటి ప్లాప్.. ఇప్పుడు జగపతి బాబు-గోపీచంద్ అన్నదమ్ములుగా నటించిన రామ బాణం అంతకన్నా ప్లాప్. ఇక లక్ష్యంలో ఇదే జగపతి బాబు-గోపీచంద్ లు అన్నద్మముల్లా నటిస్తే అది సూపర్ హిట్ కానీ.. రామ బాణంలో బ్రదర్ సెంటిమెంట్ అస్సలు వర్కౌట్ కాలేదు. రొటీన్ కథ, ప్రొడక్షన్ వాల్యూస్ భారీగా ఉండడం, స్టార్ క్యాస్ట్ ఎక్కువగా కనిపించడం, బలమైన ఎమోషన్స్ లేకపోవడం, ఫ్యామిలీ ఎంటెర్టైమెంట్ లా కాకుండా గజిబిజి గందరగోళంగా శ్రీవాస్ దర్శకత్వం.. అన్ని కలిపి గోపీచంద్ కి డిసాస్టర్ కట్టబెట్టాయి.
పక్కా కమర్షియల్, ఇప్పుడు రామ్ బాణం ఇలా వరస షాక్ లు గోపీచంద్ కెరీర్ ని డౌన్ చెయ్యడం పక్కా. మరి గోపీచంద్ ఇకపై విలన్ వేషాలు వచ్చినా రిజెక్ట్ చెయ్యకుండా ఒప్పేసుకుంటే బావుంటుంది అంటూ నెటిజెన్స్ సలహాలు ఇస్తున్నారు.. కొత్తగా కనిపిస్తేనే బెటర్. లేదంటే రొటీన్ గానే ఆలోచిస్తే ఇకపై ఆడియన్స్ ఒప్పుకోవడం కూడా కష్టమే అంటున్నారు.