ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉండడమే కాదు కాదు.. ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న సమయంలో మైత్రి మూవీస్ వారు బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ఒక ప్రాజెక్ట్ ని ప్రభాస్ హీరోగా ఫ్యాన్ ఇండియా స్టయిల్లో సెట్ చెయ్యడమే కాదు.. ఆ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీస్ నిర్మాతలు ముంబై వెళ్లి సిద్దార్థ్ ఆనంద్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చివచ్చేసారు. పఠాన్ సక్సెస్ అవ్వడంతోనే ఇదంతా చేసారు.
సిద్దార్థ్ ఆనంద్ మూవీలో ప్రభాస్-హ్రితిక్ రోషన్ నటించబోతున్నారని ప్రచారం జరగ్గా.. హ్రితిక్ రోషన్ మాత్రం ప్రభాస్ ప్రాజెక్ట్ కాదని.. ఎన్టీఆర్ తో వార్ 2 ప్రకటించడంతోనే అందరికి షాకిచ్చారు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే టాక్ మొదలయ్యింది. మైత్రి మూవీస్ వారు కి సిద్దార్థ్ అండ్ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అటు మైత్రి వారు కూడా ఈమధ్యన ఐటి రైడ్స్ ఇబ్బంది పెట్టడంతో ప్రభాస్-సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ పక్కనబెట్టేశారనే మాట కూడా వినబడుతుంది. అసలేం జరిగిందో కానీ.. ప్రభాస్-సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ మాత్రం ఆగిపోయింది అనే న్యూస్ మాత్రం వైరల్ అయ్యింది.