Advertisementt

అందుకే సమంత నాతో నటించింది: బెల్లంకొండ

Sun 07th May 2023 12:40 PM
bellamkonda sai sreenivas,samantha  అందుకే సమంత నాతో నటించింది: బెల్లంకొండ
That's why Samantha acted with me: Bellamkonda అందుకే సమంత నాతో నటించింది: బెల్లంకొండ
Advertisement
Ads by CJ

బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ఇంట్రడ్యూస్ అవడమే సమంత లాంటి టాప్ హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. బెల్లంకొండ సురేష్ నిర్మాత కావడంతో కొడుకు మొదటి సినిమాకే హీరోగా అదిరిపోయే ఎంట్రీ ప్లాన్ చేసాడు.. సమంతకి ఎన్ని కోట్లు అప్పజెప్పాడో కొడుకుతో కలిసి నటించడానికి సై అంది.. అలాగే తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించడం కూడా బెల్లకొండ సురేష్ ప్లానే. 

లేదంటే డెబ్యూ హీరోతో స్టార్ హీరోయిన్స్ కలిసి నటించడమనేది జరిగే పనేనా.. సమంత కి, తమన్నాకి కోట్లాది పారితోషకాలతో వాళ్ళని శాటిస్ ఫై చేశారనే టాక్ చాలా గట్టిగా స్ప్రెడ్ అయ్యింది. అయితే బెల్లకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ ప్రమోషన్స్ లో తాను మొదటి సినిమా తర్వాత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అందుకే రెండో సినిమాని చిన్న సినిమా గా చేశాను. కానీ నన్ను నమ్మి బోయపాటి శ్రీను నాకు జయ జానకి నాయక అవకాశం ఇచ్చారు. ఆయనకి ఎప్పటికి రుణపడిపోతాను అని చెప్పిన బెల్లకొండ సమంత, తమన్నాలు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై కూడా స్పందించాడు. 

సమంత, తమన్నాలు భారీ పారితోషకాల వలన తనతో పని చెయ్యలేదు. నా డాన్స్, యాక్టింగ్ వీడియోస్ చేసి సమంతకి తమన్నాకి పంపించాను. నా డెడికేషన్ నచ్చి నాతో సమంత సినిమాకి వర్క్ చేసింది. సమంత నాకు మంచి స్నేహితురాలు, ఇప్పటికి మేము మెసేజెస్ చేసుకుంటాము. తనకి మాయోసైటిస్ వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలని ప్రార్దించానంటూ బెల్లంకొండ శ్రీనివాస్ సమంత తనతో కలిసి నటించడానికి ఒప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు 

That's why Samantha acted with me: Bellamkonda:

Bellamkonda Sai Sreenivas About Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ