త్రిష రేంజ్ మళ్ళీ పెరిగింది. కొన్నేళ్ల క్రితం ఆమె కెరీర్ డౌన్ అయినా మళ్ళీ తమిళనాట పుంజుకుంది. అందానికి అందం, క్రేజ్ కి క్రేజ్ పెరగడంతో త్రిష రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. అందుకే త్రిష ఇప్పుడు సీనియర్ హీరోలని లెక్క చెయ్యడం లేదనే టాక్ మొదలైంది. తమిళనాట విజయ్ లాంటి స్టార్ హీరోల ఆఫర్స్ వస్తున్న తరుణంలో చిరు, బాలయ్య, నాగార్జున ఇలా సీనియర్ హీరోలతో సినిమా చేస్తే తన క్రేజ్ తగ్గుతుంది అని త్రిష భావిస్తోందట.
రెండేళ్ల క్రితమే తన రోల్ నచ్చలేదని ఆచార్య నుండి త్రిష మధ్యలోనే వెళ్లిపోగా.. బాలయ్య మూవీ కోసం అనిల్ రావిపూడి త్రిష ని తీసుకురావడానికి చాలా ట్రై చేసినా ఆమె ఒప్పుకోలేదట. ఇందులో నా రోల్ నిడివి ఎంతుంటుంది, మరో హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కుదరదన్నట్టుగా ఆమె బాలయ్య ప్రాజెక్ట్ ని రిజక్ట్ చేసింది అనే టాక్ ఉంది. అయితే త్రిష అలా చెయ్యడానికి కారణం ఆమెకి తమిళనాట పాపులారిటీ పెరడమే అంటున్నారు.
అందులోను పొన్నియన్ సెల్వన్ తో త్రిష అందం మరింతగా హైలెట్ అయ్యి ఆమెకి అక్కడి స్టార్ ఛాన్సెస్ రావడం ఆరంభించాయి. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. ఇక సీనియర్ హీరోలతో పనేముంది అనుకుందేమో అందుకే లైట్ తీసుకుంటుంది.