Advertisementt

మెగాస్టారా మజాకానా..

Sat 06th May 2023 09:12 PM
chiranjeevi  మెగాస్టారా మజాకానా..
Megastar Mazakanaa.. మెగాస్టారా మజాకానా..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత విరామం తీసుకుంటారు, వెంకీ కుడుములు తో చెయ్యాల్సిన మూవీ ఆపేసారు. సో.. ఇక ఆయన వేరే కథలు విన్నా ఇంకా దర్శకుడు దొరకలేదు.. మెగాస్టార్ చిరు కథలు వింటున్నారు కానీ.. 156 సినిమాకు సైన్ చెయ్యలేదు, బింబిసార దర్శకుడు వసిష్ఠతో అనుకున్నా.. మెగాస్టార్ ఆ ప్రాజెక్ట్ చెయ్యడం లేదు ఇలా చాలా రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో నడిచాయి. కాని భోళా శంకర్ రిలీజ్ కాకుండానే మెగాస్టార్ ఏకంగా రెండు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసారు.

ముందుగా  సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు సినిమాల ఫెమ్ కళ్యాణ్ కృష్ణ తో మెగా 156 మరొకటి బింబిసారా దర్శకుడితో మెగా 157 సినిమాలు చెయ్యబోతున్నారు.. ఇవి అఫీషియల్ అంటూ మరో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ని ఒకేసారి మొదలు పెట్టి పూర్తి చేస్తారని వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు విడుదలవుతాయని అంటున్నారు. కళ్యాణ్ కృష్ణ తో చెయ్యబోయే మూవీలో మెగాస్టార్ చిరు తో ఓ యంగ్ హీరో నటించే అవకాశం ఉంది అంటున్నారు.

అది సిద్దు జొన్నలగడ్డ కావొచ్చని ఊహాగానాలు అందించాయి. కానీ సిద్దు చిరు తో చెయ్యడం లేదట. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఆ యంగ్ హీరోకి పెయిర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా చూసిన మెగా ఫాన్స్ ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించబోతున్నారు.. దానితో  మెగాస్టారా మజాకా అంటున్నారు.

Megastar Mazakanaa..:

Updates on Chiranjeevi 156,157

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ