Advertisementt

కొడాలి నానికి తారకరత్న భార్య చెక్?

Sat 06th May 2023 06:01 PM
taraka ratna,kodali nani  కొడాలి నానికి తారకరత్న భార్య చెక్?
Tarakaratna wife check for Kodali Nani? కొడాలి నానికి తారకరత్న భార్య చెక్?
Advertisement
Ads by CJ

గుడివాడలో కొడాలి నానిని ఎదురించి గెలిచే స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్ టీడీపీలో లేరు. ఉన్నా నాని ముందు గుడివాడలో గెలవడమనేది కష్టతరమైపోయింది. గత ఎన్నికలో అవినాష్ చాలా కష్టపడినా అతను నాని ముందు నిలవలేకపోయాడు. కొడాలి నానికి గుడివాడ ఓటు బ్యాంక్ ముందు ఎవ్వరైనా తలొంచాల్సిందే అన్నట్టుగా తయారైంది అక్కడ పరిస్థితి. టిడిపి నుండి 2024 ఎన్నికల్లో గుడివాడ అభ్యర్థిగా ఎవరు నిలబడి కొడాలిపై పోటీ చేస్తారో అనే విషయంలో అప్పట్లో తారకరత్న పేరు గట్టిగా వినిపించినా తర్వాత అతని మరణం టిడిపి నాయకులకి షాకిచ్చింది.

అయితే కొడాలి నాని మీద పోటీ చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తారకరత్న వైఫ్ ని పాలిటిక్స్ లోకి తీసుకురాబోతున్నారంటూ ప్రచారమైతే ఎప్పటినుండో జరుగుతుంది. బాలయ్య-చంద్రబాబు చెబితే అలేఖ్య పాలిటిక్స్ లోకి వస్తుంది. సో తారకరత్న మృతి సింపతిపై అలేఖ్యని గుడివాడ ప్రజలు ఆదరించి ఆమెని గెలిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ బూతు మాజీ మంత్రికి చెక్ పెట్టాలంటే తారకరత్న భార్య అలేఖ్య దిగాల్సిందే అని టీడీపీ కార్యకర్తలూ కోరుకుంటున్నారు.

మరి 2024 ఎన్నికల సమయానికి అలేఖ్యని మానసికంగా కొడాలి నానిపై పోటీ పడేందుకు స్ట్రాంగ్ గా సిద్ధం చేసి బరిలో నిలిపే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయంటూ టాక్. మరి అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమెపై డెఫనెట్ గా ప్రజల్లో సింపతీ ఉంటుంది. అది గుడివాడ ప్రజల్లో ఎంతుందో అనేది ఆమె కొచ్చే ఓట్లు డిసైడ్ చేస్తాయి.

Tarakaratna wife check for Kodali Nani?:

Taraka Ratna Wife To Contest Against Kodali Nani?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ