Advertisementt

నాన్న కావాలంటే ఆ పని చేస్తారు : చైతు

Sat 06th May 2023 04:14 PM
naga chaitanya  నాన్న కావాలంటే ఆ పని చేస్తారు : చైతు
If dad wants, he will set up a project with a top director : Chaitu నాన్న కావాలంటే ఆ పని చేస్తారు : చైతు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-అఖిల్ ఇప్పడు హిట్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. అసలు అక్కినేని హీరోలకి ఇంక్లూడింగ్ నాగార్జున వరకు గత కొంతకాలంగా సక్సెస్ అనేది దూరమైంది. ఇప్పటికే నాగార్జున ఘోస్ట్ తో, అఖిల్ ఏజెంట్ డిజాస్టర్స్ తో అక్కినేని అభిమానులు చాలా డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య నుండి రాబోతున్న కష్టడి పై అక్కినేని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కొడుకుల విషయంలో నాగార్జున శ్రద్ద పెట్టడం లేదు.. వారికి మంచి కాంబినేషన్స్ ని నాగ్ సెట్ చెయ్యలేకపోతున్నారనే విమర్శలు మొదలయ్యాయి.

అయితే కష్టడి ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య నాగార్జున కొడుకుల కెరీర్ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. నేను కానీ, అఖిల్ కానీ నాన్నా మాకు ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని ఉంది అని చెబితే చాలు కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు, మీకు ఏ డైరెక్టర్ కావాలో అడగండ్రా అడ్వాన్స్ పంపిస్తాను అని చాలాసార్లు అడిగారు. మా కెరీర్ లో మేము వైఫల్యాలు చూస్తున్నామంటే ఇందులో నాన్న తప్పు ఏమి లేదు, మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిడ్యువల్ గా ఎదగాలి అనుకుంటున్నాము అంటూ నాగ చైతన్య చెప్పాడు.

నిజమే అంత పెద్ద హీరో కొడుకుల కెరీర్ గురించి ఆలోచించకుండా ఉండరు. కానీ అలా సెట్ చేసినా.. తర్వాత చైతూ-అఖిల్ ఇద్దరూ తండ్రి చాటు బిడ్డలు అంటూ ఎద్దేవా చేస్తారు. ఏది చేసినా సోషల్ మీడియాతో కష్టమే మరి.

If dad wants, he will set up a project with a top director : Chaitu:

Naga Chaitanya Interview

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ