ఒకప్పుడు కమెడియన్స్ జబర్దస్త్ పై కామెంట్స్ చేసేవారు. అక్కడ రాజకీయాలు ఎక్కువ, విలువ లేని చోట ఉండమంటూ కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు టివి ఛానల్స్ కి ఎక్కేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చేసేవాళ్ళకి ఎక్కువ పారితోషకాలు, కానీ ఢీ డాన్స్ షో లో డాన్స్ చేసేవాళ్ళకి తక్కువ పారితోషకాలు అంటూ ఈమధ్యన డాన్స్ మాస్టర్ చైతన్య వీడియో రిలీజ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకోవడం నిజంగానే కలకలం సృష్టించింది.
ఢీ డాన్స్ షోలో పాపులర్ డాన్స్ మాస్టర్ గా చైతన్య మాస్టర్ ఉన్నారు. అయితే ఆయన చేసిన అప్పులు తీర్చలేని కారణంగానే సూయిసైడ్ చేసుకున్నాడు. ఢీ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఆయన మితిమీరిన అప్పులు చెయ్యడం వలనే ఇలా జరిగింది అనేవారు లేకపోలేదు. తాజాగా అదిరే అభి జబర్దస్త్-ఢీ పారితోషకాల వ్యత్యాసాలను ఓ వీడియో ద్వారా బయటపెట్టాడు.
జబర్దస్త్ కి రేటింగ్ ఎక్కువ వస్తుంది అందుకే పారితోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పాపులారిటీని పారితోషకాలని డిసైడ్ చేస్తుంది. అయినా కేవలం జబర్దస్త్ చేసుకునే బాగుపడడం లేదు, జబర్దస్త్ చేసుకుంటూనే ఇతర షోస్ ద్వారా సంపాదించుకుని దాచుకుంటున్నారు. వచ్చినంతలో కొంతమొత్తాన్ని దాచుకోవాలి, ఎంతొస్తే అంత ఖర్చు పెట్టకూడదు. ఇండస్ట్రీలోకి రాగానే ఎవ్వరూ పిలిచి ఆఫర్స్ ఇవ్వరు. ఎర్ర తివాచీలూ పరచరు. ఎన్నో బాధలు పడి, ఎన్నో రోజులు పస్తులుంటేనే ఈ పొజిషన్ అంటూ వీడియో వదిలాడు.
అంతేకాకుండా అమితాబచ్చన్ అన్ని కోట్లు పెట్టుకుని నిర్మాణ సంస్థ పెట్టి తర్వాత సినిమాలు తీసి కోట్లు పోగొట్టుకుని కార్లు అమ్ముకున్నారు. తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి ఆయన్ని నిలబెట్టింది. మళ్ళీ డబ్బు సంపాదిస్తున్నారు. ఎవ్వరైనా పొదుపు చేసుకుంటేనే నిలబడతారు అంటూ చైతన్య మాస్టర్ సూయిసైడ్ వీడియోపై అదిరే అభి క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ పారితోషకాలు, ఢీ పారితోషకాలు వ్యత్యాసాలను కూడా ఇదే వీడియోలో అభి వివరించాడు.