ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో ఫ్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K లో ప్రభాస్ తో దీపికా పదుకొనే, దిశా పఠానీలు జోడి కడుతుంటే.. అమితాబచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. సూపర్ మ్యాన్ సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. నాగ్ అశ్విన్ విడుదల చేసే వీడియోస్ కొచ్చే లైక్స్ షేర్స్ చూస్తే అర్ధమైపోతుంది. వచ్చే ఏడాది జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ప్రాజెక్ట్ K చిత్రం షూటింగ్ ఎక్కడివరకు పూర్తి చేసారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందొ అనే ఆలోచనలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.
తాజాగా అశ్వినీదత్ కుమర్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అన్ని మంచి శకునములే సినిమాని నిర్మించిన వీరు మీడియాతో మట్లాడుతూ ప్రాజెక్ట్ K షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది.. మరో రెండు మూడు నెలల్లో మిగతా షూట్ పూర్త చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళతాము, ఆరు నెలలపాటు విఎఫెక్స్ వర్క్ కి కేటాయించి సినిమాని విడుదల చేస్తామని, ప్రమోషన్స్ ప్లాన్స్ ని త్వరలోనే రివీల్ చేస్తామంటూ చెప్పడంతో మరోసారి ప్రాజెక్ట్ K సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రపంచ స్థాయి ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K షూట్ తో పాటుగా సలార్, మారుతి మూవీ రాజా డీలక్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.