జబర్దస్త్ ని వదిలేసి వెండితెర మీద బిజీగా మారిన పాపులర్ యాంకర్ అనసూయకి ఎందుకో విజయ్ దేవరకొండ అంటే అస్సలు నచ్చదు. అంటే విజయ్ దేవరకొండ నచ్చడం కాదు ఆయన చేసే సినిమాలంటే పెద్దగా నచ్చని అనసూయ సోషల్ మీడియా వేదికగా ఇండైరెక్ట్ కామెంట్స్ చేసి రౌడీ ఫాన్స్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. మాములుగానే తనని టార్గెట్ చేసేవారిపై కస్సున లేచే అనసూయ తాజాగా రౌడీ ఫాన్స్ దగ్గర మరోసారి బుక్ అయ్యింది. కారణం విజయ్ దేవరకొండ పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్.
రీసెంట్ గా ఖుషి సినిమా సాంగ్ మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టుగా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంది. లైగర్ అప్పటినుండి The Deverakonda గా తన పేరు పోస్టర్స్ లో వేయించుకుంటున్నాడు విజయ్. ఆ పేరు ఇప్పుడు అనసూయ కంట్లో పడినట్లు ఉంది. మాములుగా ఇంగ్లీష్ గ్రామర్ పరంగా.. ఈ ది అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు మాత్రమే వాడుతూ ఉంటారు.
అనసూయ సోషల్ మీడియా వేదికగా.. ఇప్పుడే ఒకటి చూశాను ది నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ వేసిందో కానీ.. దేవరకొండ అభిమానులు మాత్రం అది విజయ్ దేవరకొండని ఉద్దేశించే ట్వీట్ చేసింది. అనసూయకి ఎంత పొగరు.. మా హీరోనే టార్గెట్ చేస్తుంది. లైగర్ డిసాస్టర్ అప్పుడు కూడా కర్మ ఫలితమంటూ పండగ చేసుకుంది.. ఇప్పుడు ఇలా నీ అంతు చూస్తామంటూ అనసూయని సోషల్ మీడియాలోనే రౌడీ ఫాన్స్ బెదిరించడం స్టార్ట్ చేసేసారు.