ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల కిలకిలలు, నిర్మాతలకు కాసుల గలగలలు అన్నట్టుగా ఏ చిత్రానికి ప్రేక్షకులు ఓటేస్తారో.. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా నిర్మాతలు సేఫ్ అవుతారు. అదే సినిమా పొతే ఘొల్లుమంటారు. ఇక ఒక్కోసారి బాక్సాఫీసు సింగిల్ సినిమాతో సరిపెట్టుకుంటే ఇంకోసారి రెండుమూడు సినిమాలు పోటీపడతాయి. అందులో ఏ సినిమా నిలబడుతుందో అందులోని కంటెంట్, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.
నిన్న మే 5 శుక్రవారం థియేటర్స్ లో గోపీచంద్ రామబాణం-అల్లరి నరేష్ ఉగ్రం మూవీస్ పోటీ పడ్డాయి. అందులో రామబాణం మూవీకి డిజాస్టర్స్ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా అవుట్ డేటెడ్ కథతో సినిమాలు చేస్తే కష్టమనేసారు. ఇక అల్లరి నరేష్ నాంది కాంబినేషన్ రిపీట్ అవడంతో ఉగ్రం మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కూడా ఆ అంచనాలు అందుకోవడంలో తడబడినా.. యావరేజ్ టాక్ తో ప్రేక్షకులు, మిక్స్డ్ రెస్పాన్స్ తో క్రిటిక్స్ ఉగ్రానికి రిజల్ట్ డిసైడ్ చేసారు.
అల్లరి నరేష్ ఉగ్రం ఈ వారం విడుదలైన సినిమాల్లో బెటర్ మూవీగా ప్రేక్షకులు, విమర్శకులు తెల్చేయ్యగా.. గోపీచంద్-శ్రీవాస్-జగపతి బాబు లాంటి స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కిన రామ బాణం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.