నాగ చైతన్య-సమంత విడిపోయాక సమంత సోషల్ మీడియా వేదికగా తన విడాకుల విషయాన్ని పదే పదే ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ వచ్చింది. రీసెంట్ గా శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత తన వైవాహిక జీవితం గురించి మాట్లాడి.. అది వర్కౌట్ అవ్వలేదు అని డైరెక్ట్ గానే చెప్పింది. నాగ చైతన్య మాత్రం సమంత విషయంలో, విడాకుల విషయంలో చాలా డీసెంట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. మీడియా మాత్రం వారు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా ఈ మేటర్ మాత్రం వదలడం లేదు.
అక్కినేని ఫ్యామిలీ కూడా ఇది అయిపోయిన గతం.. దాని గురించి ఇంకా ఇంకా వేధించడం కరెక్టా అని రిక్వెస్ట్ చేసినా మీడియా మాత్రం ఊరుకోవడం లేదు. ప్రస్తుతం కష్టడి ప్రమోషన్స్ లో ఉన్న నాగ చైతన్యకి ఇదే ప్రశ్న ప్రతిసారి ఎదురవుతూ వస్తుంది. నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి సమంతతో విడాకుల విషయంలో ఓపెన్ అయ్యాడు. మేమిద్దరం విడిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది. అఫీషియల్ గా డివోర్స్ తీసుకుని ఏడాది పూర్తయింది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. మేము విడిపోయినా.. ఆమెతో కలిసి ఉన్నన్ని రోజులు చాలా గౌరవంగానే చూశాను.
సమంత ఒక లవ్లీ ఉమెన్. ఆమె ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలకు అర్హురాలు. మీడియా ఊహగానాల కారణంగానే మా మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవలు పెద్దవయ్యాయి. చివరికి ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. నిజానికి నేను మొదట్లో ఆ ఊహగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చింకుంటున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. నా గతం, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని ఒకేలా చూస్తాను.
ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను. కానీ నా గతంలో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాస్తే బాధగా ఉంటుంది. ఆ మూడో వ్యక్తిని అగౌరవ పరిచినట్లు అవుతుంది అంటూ నాగ చైతన్య విడాకుల విషయంలో చాలా స్మూత్ గా ఓపెన్ అయ్యాడు.