పవన్ కళ్యాణ్, క్రిష్ తో హరి హర వీరమల్లు మొదలు పెట్టి రెండున్నరేళ్లు పైనే అవుతుంది. ఆయన వీరమల్లు ఒప్పుకున్నాక భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యింది, సముద్రఖని రీమేక్ కంప్లీట్ చేసారు పవన్. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, OG షూటింగ్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, OG షూటింగ్స్ ని హరి హర వీరమల్లుతో పారలల్ గా చేస్తారని అన్నారు. కానీ డిసెంబర్ నుండి హరి హర వీరమల్లు పక్కనబెట్టేసి సముద్రఖని, ఆహారిష్ శంకర్, సుజిత్ సినిమాతోనే పవన్ ట్రావెల్ చేస్తున్నారు.
రీసెంట్ గా వోగ్ పూణే షెడ్యూల్ పూర్తయ్యాక హరి హర వీరమల్లు సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతారని అనాన్రు. కానీ పవన్ ఇప్పుడు ముంబై నుండి OG కొత్త షెడ్యూల్ కోసం పూణే వెళ్లారు. అక్కడి నుండి పవన్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళ్లకుండా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు. దానితో వీరమల్లు కి మోక్షం ఎప్పుడో అంటూ పవన్ ఫాన్స్ అడుగుతుంటే.. హరి హర వీరమల్లు మేకర్స్ మాత్రం ఏం చెయ్యాలో తెలియక నీళ్లు నములుతున్నారని తెలుస్తుంది.
అందుకే షూటింగ్ లేట్ అవుతున్న కారణంగా హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇవ్వకుండా, టీజర్ ఇవ్వకుండా నాన్చుతున్నారు అనే టాక్ కూడా మొదలయ్యింది. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు క్రిష్ కి మోక్షం కలిగిస్తారో చూడాలి.