మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ జోష్ లో దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ సక్సెస్ తర్వాత వాల్తేర్ వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగాస్టార్ మరో ఆరు నెలలు తిరక్కుండానే భోళా శంకర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఆగష్టు 11న భోళా శంకర్ రిలీజ్ అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మెగాస్టార్ ని లెక్క చెయ్యడం లేదు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ ఆగష్టు 10 న రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించడంతో అందరూ మెగాస్టార్ ని లెక్కచెయ్యని సూపర్ స్టార్ అంటున్నారు. అంటే కొన్నేళ్లుగా రజినీ సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి. ఒకవేళ టాక్ బావుంటే సూపర్ స్టార్ ని ఆపతరం ఎవరికీ లేదు. అలాంటి సమయంలో సూపర్ స్టార్ మెగాస్టార్ తో బాక్సాఫీసు ఫైట్ కి దిగడం అనేది ఇప్పుడు మెగా అభిమానులని కలవరపెడుతుంది.
బాక్సాఫీసు అన్నాక క్రేజీ ఫైట్స్, క్రేజీ పోటీ ఉండడం సహజమే. చిరంజీవి ఇక్కడ మెగాస్టార్ అయితే.. రజినీకాంత్ కోలీవుడ్ లో సూపర్ స్టార్. సో వీరి మధ్యన పోటీ ఉన్నా ప్రాబ్లెమ్ ఉండదనేది మేకర్స్ ప్లాన్. అందుకే ఆగస్టు 10న సూపర్ స్టార్ వస్తే.. ఆగష్టు 11న మెగాస్టార్ వస్తారు. సూపర్ స్టార్ జైలర్ కి హిట్ టాక్ వస్తే మెగాస్టార్ కి ప్రాబ్లెమ్. అలా జరక్కపోతే మెగాస్టార్ కి కలిసొస్తుంది. మరి 2023 ఇండిపెండెంట్ డే విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం.