సౌత్ లో యూత్ ని తన చిట్టి నడుముతో ఓ ఊపు ఊపి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కన్న ఇలియానాకి హిందీ ఇండస్ట్రీ ఒకటి రెండు అవకాశాలకే పక్కనబెట్టేసింది. ఆ తర్వాత ఇలియానా సిల్వర్ స్క్రీన్ మీద కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపించింది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రుతో డేటింగ్, తర్వాత అతనితో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లి బరువు పెగడం ఇవన్నీ ఇలియానాని బాగా ఇబ్బంది పెట్టాయి.
అయితే అటు బాలీవుడ్ కెరీర్ ఇటు బాయ్ ఫ్రెండ్ కూడా దేబ్బెయ్యడంతో సౌత్ అవకాశాలు కోసం వెయిట్ చేసింది. సౌత్ కూడా ఇలియానాని లైట్ తీసుకోవాడంతో సౌత్ ఇండస్ట్రీపై కూడా ఇలియానా నోటికొచ్చింది మాట్లాడింది. ఇక కొన్నాళ్లుగా సోషల్ మీడియాకే పరిమితమైన ఇలియానా తనకు బేబీ పుట్టబోతున్నట్లుగా నర్మగర్భంగా ఓ టీ షర్ట్ షేర్ చేసి షాకిచ్చింది. దానితో ఇలియానాకి పెళ్లెప్పుడయ్యింది, ఆమె భర్త ఎవరో.. అసలు ఈ ప్రెగ్నెన్సీ విషయమేమిటో అర్ధంకాక నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు.
తాజాగా ఇలియానా ఇప్పుడు తన బేబీ బంప్ ని ఇన్స్టా ద్వారా పరిచయం చేసింది. కాఫీ కప్ పట్టుకుని తన ఫేస్ కనిపించకుండా బేబీ బంప్ చూపిస్తున్న పిక్ షేర్ చెయ్యగా అది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరోసారి ఇలియానాకి పుట్టబోయే బేబీ కి తండ్రెవరు అంటూ నెటిజెన్స్ ఆరాలు మొదలు పెట్టేసారు.