Advertisementt

ఆదిపురుష్ పై అనుమానాలు అక్కర్లేదు

Thu 04th May 2023 11:10 AM
adipurush  ఆదిపురుష్ పై అనుమానాలు అక్కర్లేదు
Suspicions on Adipurush are dismissed ఆదిపురుష్ పై అనుమానాలు అక్కర్లేదు
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఆదిపురుష్ మరోసారి వాయిదా పడుతుందా.. ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. కానీ మేకర్స్ మాత్రమే ఆదిపురుష్ వాయిదా వేసేదే లేదు.. జూన్ 16 పక్కా అంటున్నారు. రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవంటూ బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ నుండి ట్వీట్స్ వేయిస్తున్నారు. నిన్న తరన్ ఆదర్శ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆదిపురుష్ అనుకున్న సమయానికే వస్తుంది.. పోస్ట్ పోన్ లేదు అంటూ ట్వీట్ పడింది.

గత కొద్దిరోజులుగా ఆదిపురుష్ ఏదో విషయంలో మీడియాలోనే కనిపిస్తున్నా ఈ రూమర్స్ ఎవరు పుట్టిస్తున్నారో అర్ధం కాక మేకర్స్ కూడా సతమతమవుతున్నారు. జూన్ 16 టార్గెట్ గా ఆదిపురుష్ మేకర్స్ ఈనెల 9 న ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని దానికోసం ప్రధాన నగరాల్లో భారీగా ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆయన షూటింగ్స్ కి కొద్దిగా బ్రేక్ ఇవ్వబోతున్నారట. 

హీరోయిన్ కృతి సనన్, ఓం రౌత్, అలాగే ఆదిపురుష్ నిర్మాతలు ఇప్పటికే పలు దేవాలయాలను సందర్శిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ 40 రోజుల్లో ఆదిపురుష్ ని ప్రేక్షకుల్లోకి ఎంతగా తీసుకెళ్లాలో ప్లాన్స్ చేసేసారట. జూన్ 13 నుండే ప్రీమియర్స్ హడావిడి కూడా మొదలు పెట్టెయ్యబోతున్నారు. సో ఆదిపురుష్ విడుదలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

Suspicions on Adipurush are dismissed:

Adipurush release on June 16

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ