పదిహేడేళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన కృతి శెట్టి ఉప్పెన చిత్రంలో చాలా ట్రెడిషనల్ గా డీసెంట్ లుక్స్ తో కనిపించింది. తర్వాత లక్కీ హీరోయిన్ గా యంగ్ హీరోలతో జోడి కట్టింది. శ్యామ్ సింగ రాయ్ లో మోడ్రెన్ లుక్ మార్చినా అంతగా కృతి శెట్టి ఆకట్టుకోలేదు. ఇక ద వారియర్, నితిన్, సుధీర్ బాబు సినిమాల్లోనూ మోడ్రెన్ గానే కనిపించింది. నాగ చైతన్యతో చేసిన బంగార్రాజు లో సారీస్, హాఫ్ సారీ లుక్స్ తో అద్భుతంగా కనిపించిన కృతి శెట్టికి వరసగా మూడు డిజాస్టర్స్ బాగా ఇబ్బంది పెట్టేశాయి.
ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపించకుండా సైలెంట్ గా నాగ చైతన్య తో కష్టడి మూవీ పూర్తి చేసి ప్రమోషన్స్ లోకి దిగింది. అయితే ఇప్పటివరకు నాగ చైతన్య ఒక్కడే కష్టడి ప్రమోషన్స్ లో కనిపించగా నిన్నటి నుండి కృతి శెట్టి కూడా కష్టడి ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యింది. తెలుగు, తమిళ ప్రమోషన్స్ తో హడావిడి చేస్తుంది. అయితే కష్టడి ప్రమోషన్స్ తో అందరి చూపు తన మీదే పడేలా ఈ బ్యూటీ ప్లాన్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
సారీ లోనే కనిపించినా మోడ్రెన్ లుక్ లో దర్శనమిచ్చింది. సింగిల్ స్టెప్ ట్రాన్స్పరెంట్ సారీ తో కృతి శెట్టి అదరగొట్టేసింది. కృతి శెట్టి బ్యూటిఫుల్ సారీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇకపై సినిమా రిలీజ్ వరకు ఇంకెన్ని లుక్స్ చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుందో అంటున్నారు నెటిజెన్స్.