Advertisementt

ప్రభాస్-మారుతి ఫిల్మ్ పై మహేష్ కామెంట్స్

Thu 04th May 2023 10:22 AM
jabardasth mahesh,prabhas-maruthi film  ప్రభాస్-మారుతి ఫిల్మ్ పై మహేష్ కామెంట్స్
Mahesh comments on Prabhas-Maruthi film ప్రభాస్-మారుతి ఫిల్మ్ పై మహేష్ కామెంట్స్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో కామెడీ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పైన కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోలకి స్నేహితుల రోల్స్ తో బాగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ మహేష్ ఇప్పుడు ఏ సినిమాలో చూసినా అతనే కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ రంగస్థలం, మహానటి లో నెగెటివ్ కేరెక్టర్స్ తో పాపులర్ అయిన మహేష్ ఇప్పుడు ప్రభాస్-మారుతీ ఫిల్మ్ లో కూడా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా మహేష్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇచ్చే ఫుడ్ ట్రీట్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

సెట్ లో ఎంతమంది ఉన్నా.. అంటే 200 మంది ఉన్నా, మూడు వందల మంది ఉన్నా ఆయన ఇంటి నుండే ఫుడ్ తెప్పిస్తారని, నాకు ఏ ఫుడ్ అంటే ఇష్టమని అడిగి మటన్ అని చెప్పగానే తర్వాత రోజు నాకు అదే మటన్ ఐటెం వచ్చేలా చేసారు. ఆయనది చాలా గొప్ప మనసు. ప్రభాస్ చాలా రోజుల తర్వాత కామెడీ రోల్ పోషిస్తున్నారు. చెక్స్ షర్ట్ వేసుకుని కామెడీ కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. ఆయన లుక్ అన్ స్టాపబుల్ అంటూ మహేష్ మారుతి సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారో హింట్ ఇచ్చేసాడు.

మరి ప్రభాస్ కూడా యాక్షన్ ఫిలిమ్స్ మధ్యలో ఇలాంటి ఓ కామెడీ సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మారుతీ తో రాజా డీలక్స్ ఒప్పుకున్నారు. ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో ఈ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

Mahesh comments on Prabhas-Maruthi film:

Jabardasth Mahesh comments on Prabhas-Maruthi film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ