Advertisementt

ఎటు మాట్లాడినా ఇరుక్కుంటామని తెలుసు

Wed 03rd May 2023 08:17 PM
mohan babu,rajinikanth  ఎటు మాట్లాడినా ఇరుక్కుంటామని తెలుసు
We know that no matter what we talk about, we will stay ఎటు మాట్లాడినా ఇరుక్కుంటామని తెలుసు
Advertisement
Ads by CJ

రజినీకాంత్ మేటర్ లో ఆయన స్నేహితుడు మంచు మోహన్ బాబు మౌనాన్ని పాటిస్తున్నారు. రజినీకాంత్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబే. అయితే ఈమధ్యన టిడిపి నాయకుడు చంద్రబాబుని రజినీకాంత్ ప్రశంసించడంతో వైసీపీ ప్రభుత్వ ఎమ్యెల్యేలు, మంత్రులు రజినీకాంత్ ని అనరాని మాటలు అన్నారు. ఈ విషయంలో రజినీకాంత్ తప్పేమి లేదు. అటు వైసిపీ ప్రభుత్వాన్ని కానీ జగన్ ని కానీ ఆయన పల్లెత్తుమాట అనలేదు. 

కేవలం చంద్రబాబు నాయుడిని పొగిడిన కారణంగానే ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే రజినీకాంత్ ఫ్రెండ్ మోహన్ బాబు ఈ విషయంలో రజినీకాంత్ కి సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకుంటే అటు జగన్ ప్రభుత్వానికి, రిలేటివ్ అయిన జగన్ కి యాంటీ అవ్వాల్సి ఉంటుంది. ఇటు మాట్లాడకపోతే రజినీ దగ్గర బ్యాడ్ అవుతుంది. కొంతకాలంగా మోహన్ బాబుకి కూడా చంద్రబాబు అంటే పడడం లేదు. మధ్యలో ఏదో కలిసినా అలా అలా మాట్లాడుకుంటున్నారు కానీ.. చంద్రబాబు వలన ఆయనేదో నష్టపోయానంటూ ఉంటారు. 

సో రజినీకాంత్ దగ్గర బ్యాడ్ అయినా సరే.. ఈ మేటర్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అన్న ఫీలింగ్ లో ఆయన ఉన్నారనుకుంటున్నారు. మరోపక్క ఇంట్లో గొడవలే సరిచేసుకోలేని మోహన్ బాబు రజినీకాంత్ విషయంలో మాట్లాడితే మాత్రం ఎవరు పట్టించుకుంటారు, కొడుకులిద్దరూ కొట్టుకు చస్తుంటే.. ఆయనకే ఏం చెయ్యాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. ఆయనేం మాట్లాడుతారులే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

We know that no matter what we talk about, we will stay:

Why Mohan Babu Silent On Rajinikanth Issue

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ