Advertisementt

OG : ముంబైలో ఫినిష్.. పూణే లో స్టార్ట్

Wed 03rd May 2023 07:22 PM
og,pawan kalyan  OG : ముంబైలో ఫినిష్.. పూణే లో స్టార్ట్
OG : Finish in Mumbai.. Start in Pune OG : ముంబైలో ఫినిష్.. పూణే లో స్టార్ట్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా అప్ డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొక అప్ డేట్ వచ్చేస్తుంది. ఫాన్స్ అయితే విపరీతంగా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. నిన్న సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG షూటింగ్ ముంబై షెడ్యూల్ ముగిసినట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ పై ఓ సాంగ్ చిత్రీకరణ మూడు రోజుల పాటు ఉంటుంది అని తెలిసినా క్లారిటీ లేదు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం హరీష్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్ కమ్ పవన్ ఫ్రెండ్ ఆనంద్ సాయి తో కలిస్ లొకేషన్ లో ఉన్న పిక్స్ షేర్ చేసారు.

ఆ అప్ డేట్ వచ్చిన కాసేపటికే దానయ్య ఎంటర్టైన్మెంట్ నుండి OG లేటెస్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చేసారు. Pune… You have our heart.💚Lush green landscapes… Beautiful @priyankaamohan… and the almighty  @PAWANKALYAN New schedule begins today. #TheyCallHimOG #OG అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసేసారు. నిన్న ముంబై షెడ్యూల్ పూర్తి కాగా.. ఈరోజు నుండి పూణేలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినట్టుగా చెప్పారు.

పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ లపై దర్శకుడు సుజిత్ ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి వెళతారో.. హరి హర వీరమల్లు కోసం కదులుతారో అనేది ఇప్పుడు ఫాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న.

OG : Finish in Mumbai.. Start in Pune:

OG Pune schedule begins

Tags:   OG, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ