బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరిపోతోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుండే సక్సెస్ లతో దూసుకుపోతుంది. అన్న ఇమ్రాన్ తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే సారా అలీ ఖాన్ గ్లామర్ విషయంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి పోటీకి వెళుతుంది. జిమ్ వేర్, ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ ఇలా ఏ విషయంలో అయినా సారా అలీ ఖాన్ ప్రత్యేకతని చూపిస్తుంది.
అయితే జాన్వీ కపూర్ కోసం సౌత్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లుగా సారా అలీ ఖాన్ సౌత్ ఎంట్రీ పై సౌత్ ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ గా కనిపించలేదు. కారణం అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులు జాన్వీ కపూర్ తెలుగులో నటించాలని కోరుకున్నారు. అయితే సారా అలీ ఖాన్ ఆ మధ్యలో విజయ్ దేవరకొండ తో సౌత్ మూవీలో నటించే ఛాన్స్ ఉంది అన్నారు. అక్కడ విజయ్ ముంబై లో జరిగే పార్టీలో సారా అలీ ఖాన్ తో ఫ్రెండ్ షిప్ కూడా చెయ్యడంతో అందరూ అలానే అనుకున్నారు.
తాజాగా సారా అలీ ఖాన్ శ్యామల్ అండ్ భూమిక హ్యాండీక్రాఫ్టెడ్ లెహంగాలో మెరిసిపోయింది. డిజైనర్ అవుట్ ఫిట్ లో సారా అలీ ఖాన్ అందాలు ఎక్స్పోజ్ చేస్తూ మతి పోగొట్టింది. అందంగా, ఆకర్షణగా, గ్లామర్ గా ఇలా ప్రతి విషయంలోనూ సారా అలీ ఖాన్ అదరగొట్టేసింది.