లక్కీ బ్యూటీ లక్కీ బ్యూటీ అంటూ చాలామంది హీరోయిన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాము. వరసగా స్టార్ హీరోల ఆఫర్స్, వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోయే ఏ హీరోయిన్ అయినా లక్కినే. అలా గతంలో సమంత, కాజల్, రకుల్, తర్వాత పూజ హెగ్డే, రష్మిక చెలరేగిపోయి ఆఫర్స్ పట్టుకుని అదృష్టవంతులుగా మీడియాలో కనిపించేవారు. తర్వాత కృతి శెట్టి ఆ రకమైన ఊపు ఊపింది. ఉప్పెన సినిమా విడుదల కాకుండానే యంగ్ హీరోలతో వరస ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా లక్కీ బ్యూటీ గా వెలిగిపోతుంది శ్రీలీలే.
నిజంగా లక్కీ హీరోయిన్ కి పర్ఫెక్ట్ మీనింగ్ శ్రీలీల అనేలా ఉంది. ప్లాప్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్లాప్ అన్న ధమాకాని తన డాన్స్ లతో 100 కోట్ల మార్క్ దాటించిన శ్రీలీల రేంజ్ ఇప్పుడు ఏ హీరోయిన్ కి లేనంతగా ఉంది. ఇంతవరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ సాధించని రేర్ ఫీట్ శ్రీలీల సాధించేలా కనిపిస్తుంది. ఆమె ఎనర్జిటిక్ లుక్స్, ఆమె అందం, డాన్స్ తో పాటుగా కావాల్సినంత లక్కు ఆమెకి ఉంది. అందుకే స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో, సీనియర్ హీరోతో ఇలా ఏ ఒక్క ప్రోజెక్ట్ విడిచిపెట్టడం లేదు. శ్రీలీల టాలీవుడ్ లో నటిస్తున్న మూవీస్ దాదాపు పది ప్రాజెక్ట్స్ అంటే అవాక్కవడం ఖాయం.
ప్రస్తుతం మహేష్ బాబు SSMB28, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, బాలయ్య NBK108 క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటుగా.. యంగ్ హీరోల్లో రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ ఇలా పలు ప్రాజెక్ట్ శ్రీలీల చేతిలో ఉండగా.. ఆమె ఎక్కడా డేట్స్ క్లాష్ కాకూండా షూటింగ్స్ చేస్తూనే ఇప్పుడు VD12 లోకి ఎంటర్ అయ్యింది. లైగర్ ప్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో ఖుషి మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ తదుపరి మూవీ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికవడమే కాదు.. ఈరోజు జరిగిన VD12 ఓపెనింగ్ లో మెరిసిపోయింది.
విజయ్ దేవరకొండ పక్కన పర్ఫెక్ట్ జోడిగా శ్రీలీల ఎల్లో డ్రెస్ లో బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసింది. మరి ఇన్ని ప్రాజెక్ట్ తో శ్రీలీల డైరీ ఫుల్ అవడం చూస్తే లక్కీ అనకుండా ఎలా ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో ఇంత లక్కీ గా ఎవ్వరికి ఇన్ని ఛాన్సెస్ రాలేదు. శ్రీలీలని అందుకే.. లక్కీ కి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది.