సమంత ఒక్కసారి కాదు రెండుసార్లు ముంచేసింది అనే మాట దిల్ రాజు డైరెక్ట్ గా బయటపెట్టకపోయినా.. ఇదే మీనింగ్ వచ్చేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడం హాట్ టాపిక్ గా మారింది. సమంత లేటెస్ట్ చిత్రం శాకుంతలం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ జర్క్ ఇచ్చింది అని దిల్ రాజు చెప్పిన ప్రోమోనే సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు ఆ ఫుల్ ఇంటర్వ్యూలో దిల్ రాజు మరిన్ని విషయాలను బయటపెట్టాడు.
ఎంతో ఇష్టపడి తమిళ 96 ని సమంత హీరోయిన్ గా పెట్టి జాను గా రీమేక్ చేస్తే దానికి డబ్బులు రాలేదు, అలాగే హిందీలో జెర్సీ రీమేక్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓటిటిలో ఒరిజినల్ 96 అందరూ చూసెయ్యడంతో జాను సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక కరోనా సమయంలో అన్ని లాంగ్వేజెస్ మూవీస్ ని ఓటిటీల ద్వారా ఆడియన్స్ వీక్షించేస్తున్నారు. సో ఇకపై రీమేక్ లు చెయ్యడం కరెక్ట్ కాదు అంటూ దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
శాకుంతలం సినిమా ఆడియన్స్ కి నచ్ఛలేదు అంటే అది ప్లాప్ అయ్యింది అనే దానర్ధం. ఆ సినిమా ప్రేక్షకులకి రుచించలేదు అంటూ దిల్ రాజు సమంత చేసిన శాకుంతలం, జాను చిత్రాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.