అఖిల్ అక్కినేని ఏజెంట్ రిజల్ట్ తో కాస్త డిస్టర్బ్ అయ్యాడు. కెరీర్ లో హిట్ కొట్టాలనే తపనతో ఉన్న అఖిల్ కి వరస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. అఖిల్ చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే ఉంది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఏజెంట్ మూవీ ఘోరంగా దెబ్బేయ్యడంతో అఖిల్ ప్రస్తుతం సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు.
అయితే అఖిల్ తదుపరి మూవీ కన్ ఫర్మ్ అవడమే కాదు.. అఖిల్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. ఎన్టీఆర్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ తర్వాత కూడా సౌత్ లోనే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలో హీరోయిన్ గా సెట్ అయ్యింది అన్నారు. కానీ ఇప్పుడు జాన్వీ సౌత్ సెకండ్ మూవీ అఖిల్ తోనే ఉండబోతుంది అంటున్నారు.
అఖిల్ కూడా కొత్త దర్శకుడితో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడని.. ఆ చిత్రంలో అఖిల్ సరసన జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.