అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబోలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ ఏప్రిల్ 28 న భారీ అంచనాలు నడుమ భారీగా విడుదలై ఆ అంచనాలు అందుకోలేక ఢీలా పడిపోయి అక్కినేని ఫాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని డిస్పాయింట్ చేసేసింది. అఖిల్ డిసాస్టర్ తర్వాత ఏజెంట్ డిసాస్టర్ అఖిల్ కెరీర్ లో మచ్చలా మిగిలిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం అఖిల్ ని నిలువునా ముంచేసింది. ఏజెంట్ ప్లాప్ కి నిర్మాత అనిల్ సుంకర బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో ద్వారా క్షమాపణలు చెప్పడం అందరిని కదిలించింది.
అయితే థియేటర్స్ లో అంత ఘోరమైన డిసాస్టర్ అయిన ఏజెంట్ మూవీ డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ సోని లివ్ దక్కించుకుంది. అయితే ప్రెజెంట్ సినిమా డిసాస్టర్ అవడంతో సోని లివ్ కూడా హడావిడిగానే ఏజెంట్ ని ఓటిటిలోకి తెచ్చేస్తుంది. డిజాస్టర్స్ మూవీస్ మూడు వారాలు తిరక్కుండానే ఓటిటిలోకి వచ్చేస్తున్న సందర్భంలో ఏజెంట్ మూవీ కూడా మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అనుకున్న దానికంటే.. ముందుగానే స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో మిస్ చేసుకున్న వారు ఓటిటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సోనీ లైవ్ ఆ డేట్ లాక్ చెయ్యడంతో ఏజెంట్ ఓటిటి రిలీజ్ కోసం ఓటిటి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.