యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రీసెంట్ గా మొదలైన #NTR30 షూటింగ్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించిన కొరటాల శివ ఇప్పుడు రెండో షెడ్యూల్ ని ముగించేసిన విషయం DOP రత్నవేలు ఇచ్చిన అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ అస్సలు ఆగడం లేదు. సినిమాని లేట్ గా మొదలు పెట్టి డిస్పాయింట్ చేసినా ఇంత స్పీడుగా #NTR30 షూటింగ్ పూర్తయిపోతుండడం వాళ్ళకి ఆనందాన్నిచ్చింది.
Completed the 2nd schedule of #NTR30 with a powerful action🔥 @tarak9999 brother’s style and action is incredible ! #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts VASTHUNAA !! అంటూ రత్నవేలు ట్వీట్ చేసారు.
మరి ఎన్టీఆర్ బర్త్ డే సమయానికి కొరటాల శివ తెరకెక్కించిన షెడ్యూల్ నుండి #NTR30 గ్లిమ్ప్స్ వదిలే అవకాశం ఉంది అంటున్నారు. ఏప్రిల్ 5 న విడుదల కాబోయే #NTR30 టైటిల్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి వచ్చే అవకాశం ఉంది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేసారు.