Advertisementt

పవన్ కళ్యాణ్ కి ఇదైనా కలిసొస్తుందా?

Tue 02nd May 2023 10:12 PM
pawan kalyan,og  పవన్ కళ్యాణ్ కి ఇదైనా కలిసొస్తుందా?
Does Pawan Kalyan agree with this? పవన్ కళ్యాణ్ కి ఇదైనా కలిసొస్తుందా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో OG మూవీ చేస్తున్నారు. ముంబై పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని టీమ్ మహాబలేశ్వర్ కి వెళ్ళింది. అక్కడ హీరోయిన్ ప్రియాంక మోహన్ తో మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సాంగ్ షూట్ లో పాల్గొనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో చేసిన సినిమాలేవీ అచ్చి రాలేదు. అందులో బాలు, పంజా రెండు చిత్రాలు ఘోరంగా విఫలమయిన చిత్రాలే. 

పంజా అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిసాస్టర్ మూవీగా నిలిచిపోయింది. బాలు పరిస్థితి అంతే. మరి ఇప్పుడు అదే గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న OG పవన్ కి హిట్ ఇస్తుందా అనే సందేహాలను చాలామంది వెలిబుచ్చుతున్నారు. సుజిత్ మాత్రం OG షెడ్యూల్ స్టార్టింగ్ విడియోతోనే దుమ్మురేపాడు. ఆ వీడియో తోనే పక్కా హిట్ కొట్టేలా కనిపించింది. సాహో కూడా సుజిత్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తోనే చేసాడు.

కానీ అది ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. మరి పవన్ కళ్యాణ్ తో దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి సక్సెస్ ఇస్తుందో, లేదో.. చూడాలి. పవన్ కళ్యాణ్ OG షూటింగ్ కి హాజరవుతున్న లుక్స్ తోనే ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ వస్తే ఆగుతారా..!

Does Pawan Kalyan agree with this?:

Pawan Kalyan OG Update

Tags:   PAWAN KALYAN, OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ