Advertisementt

చెన్నై కి బై బై చెప్పేసిన నటి

Tue 02nd May 2023 08:35 PM
actress pakeezah  చెన్నై కి బై బై చెప్పేసిన నటి
Actress Pakeezah gets emotional చెన్నై కి బై బై చెప్పేసిన నటి
Advertisement
Ads by CJ

చెన్నై లో తినడానికి తిండిలేక అక్కడి సినిమా సెలబ్రిటీస్ ఎవరూ ఆదుకోకపోవడంతో నటి పాకీజా దిక్కుతోచని స్థితిలో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ హెల్ప్ తో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యింది. మోహన్ బాబు పెదరాయుడు, అసెంబ్లి రౌడీ సినిమాల్లో నటించిన్ పాకీజా చిన్న చితక కేరెక్టర్స్ తో మంచి మంచి స్థితిలోనే ఉన్న పాకీజా తర్వాత తన ఊరు చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యింది. కానీ అక్కడ పాకీజాకి సినిమా అవకాశాలు తగ్గడంతో ఆమె దీన స్థితిలోకి వెళ్ళిపోయింది. 

ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె పరిస్థితిని చూసిన చిరు, మా అధ్యక్షుడు విష్ణులాంటి వాళ్ళు ఆమెకి సహాయం చెయ్యగా.. ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది.

ఇక్కడే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని పాకీజా షూటింగ్స్ కి హాజరవుతుంది. ఈటివి జబర్దస్త్ స్టేజ్ పై కనిపించిన పాకీజా తర్వాత జీ తెలుగు సీరియల్ లో విలన్ కేరెక్టర్ పోషిస్తుంది. హైదరాబాద్ కి వస్తే తన సొంతూరు వచ్చినట్టుగా ఉంది, ఇకపై హైదరాబాద్ నుండి ఎక్కడికి వెళ్ళను. చెన్నైకి అసలే వెళ్లను అంటుంది పాకీజా. తనకి ఇక్కడ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని, ఓ అసిస్టెంట్ ని కూడా పెట్టుకున్నాను, ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారంటుంది. 

అంటే దీనిని బట్టి పాకీజా చెన్నైకి బై బై చెప్పేసి హైదరాబాద్ లోనే సెటిల్ అవుతుందన్నమాట.

Actress Pakeezah gets emotional:

Actress Pakeezah Vasuki Personal Life Struggles

Tags:   ACTRESS PAKEEZAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ