Advertisementt

విచిత్రమంటే ఇదేనండి!

Tue 02nd May 2023 07:45 PM
tamil actress shalini  విచిత్రమంటే ఇదేనండి!
Tamil Actress Celebrates Divorce With Viral Photoshoot విచిత్రమంటే ఇదేనండి!
Advertisement

డబ్బు ఎక్కువైన వారు కుక్కలకి పెళ్లిళ్లు చేసి ఆనందం తీర్చుకుంటారు. కొంతమంది వారానికో పార్టీ అంటూ ఖర్చు పెడుతూ ఉంటారు. పబ్బులు, పార్టీలు ఇవన్నీ బోర్ కొట్టేసి కొత్తదనం కోరుకున్నవాళ్ళు ఉంటారు. అల్లు అర్జున్ వరుడు సినిమా తర్వాత అందరూ ఐదు రోజుల పెళ్లిళ్లు అంటూ మంగళ స్నానాల దగ్గర నుండి, పెళ్లి కుమార్తెని చెయ్యడం, మెహిందీ, సంగీత్ అంటూ పెళ్లిళ్లు గ్రాండ్ గా చేస్తుంటే వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ మొదలు పెట్టారు.

ఇంకొంతమంది బేబీ షవర్ ఫంక్షన్ ముందు బేబీ బంప్ ఫోటో షూట్స్ చేయించుకుంటున్నారు. ఇక పిల్లలకి హాఫ్ సారీ ఫంక్షన్ చెయ్యాలన్నా మంగళ స్నానాలు, సంగీత్, మెహిందీ.. ఈ ప్రీ ఫోటో షూట్ అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రీ ఫోటో షూట్స్ ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కానీ ఇప్పుడు ఈ ప్రీ ఫోటో షూట్ లో ఓ విచిత్రమైన ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది డివోర్స్ ఫోటోషూట్. తమినాడులో ఓ నటి తనకి విడాకులొచ్చిన సందర్భంలో ఫోటో షూట్ చేయించుకుని సెలెబ్రేట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

భార్య భర్తల బంధం తెగిపోవడం, విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ నటి మాత్రం తన లైఫ్ లో అదే ఆనందకరమైన సందర్భం అంటూ ఫోటో షూట్ చేయించుకుని సెలెబ్రేట్ చేసుకోవడంతో అది కాస్తా ట్రెండ్ అవుతుంది. తమిళ బుల్లితెర నటి షాలిని మల్లుమ్ తన భర్త రియాజ్ తో విడిపోయి ఇలా పండగలా ఆ విడాకులు సెలెబ్రేట్ చేసుకుంది. రియాజ్ ని కొంతకాలం క్రితం వివాహం చేసుకుని ఓ కూతురుని కన్న షాలిని భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు కోసం కోర్టు కెళ్ళింది.

చెన్నై కోర్టు విడాకులు మంజూరు చెయ్యడంతో షాలిని ఇలా ఫోటో షూట్ చేయించుకుని తన అందాన్ని పంచుకోవడం చూసిన నెటిజెన్స్ విచిత్రమంటే ఇదేనండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tamil Actress Celebrates Divorce With Viral Photoshoot:

Tamil Actress Shalini Celebrates Divorce With Viral Photoshoot

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement