Advertisementt

PKSDT టైటిల్ అదేనా?

Tue 02nd May 2023 05:56 PM
pksdt  PKSDT టైటిల్ అదేనా?
PKSDT Title Locked ? PKSDT టైటిల్ అదేనా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో సముద్ర ఖని తెరకెక్కిస్తున్న #PKSDT చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేసిన సముద్రఖని ప్రస్తుతం పవన్ తో పనిలేని సన్నివేశాలను సాయి ధరమ్ తేజ్-హీరోయిన్ కేతిక శర్మ ఇతర నటులపై చిత్రీకరిస్తున్నారు. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మే 5 న విడుదల కాబోతున్న ఇతర లాంగ్వేజ్ ల విరూపాక్ష ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. 

అయితే మేనమావ పవన్ తో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ బయటికి వచ్చింది. అదే దేవుడే దిగి వచ్చిన అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది. నాగార్జున హిట్ సినిమాలోని ఈ సాంగ్ లిరిక్ ని పవన్ సినిమా టైటిల్ గా వాడెయ్యబోతున్నారట. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో కనిపించనున్నారు. అందుకే ఈ చిత్రానికి దేవుడే దిగి వచ్చిన టైటిల్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారట. త్వరలోనే #PKSDT టైటిల్ అనౌన్సమెంట్ ఉండబోతుంది అని తెలుస్తుంది. 

త్వరగా టైటిల్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు సముద్రఖని చూస్తున్నారట. ఎందుకంటే జులై 28 న #PKSDT రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టే.. ఇలా తొందరపడుతున్నారట.

 

PKSDT Title Locked ?:

PKSDT Looking At Devude Digivachina?

Tags:   PKSDT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ