సమంతపై ఎంతగా సింపతీ క్రియేట్ అయ్యిందో.. ప్రస్తుతం ఆమెపై అంత నెగిటివిటి మొదలైంది. ఆమె గత ఏడాది మాయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పూర్తిగా కోలుకున్నాకే సినిమా షూటింగ్స్ పెట్టుకుంటే పోయేది. కానీ ఇంకా కోలుకోవాల్సి ఉండగానే సమంత షూటింగ్స్ కి హాజరవుతూ శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంది. అక్కడే సమంతపై నెగిటివిటి మొదలయ్యింది. శాకుంతలం ప్రమోషన్స్ లో డల్ గా కనిపించిన సమంత సిటాడెల్ ప్రీమియర్స్ లో ఫ్రెష్ లుక్స్ ఉండడంతో అందరూ సమంతని ఆడేసుకున్నారు.
ఇక సిటాడెల్ వెబ్ సీరీస్ లో సమంత వరుణ్ ధావన్ తో కలిసి పవర్ ఫుల్ పాత్ర చేస్తుంది. ఈ సీరీస్ లో సమంత యాక్షన్ చెయ్యాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే సమంత కొద్దిరోజుల కింద తన చేతులకి గాయాలైన పిక్స్ ఇన్స్టాలో షేర్ చేసింది. తాజాగా ఇట్స్ టార్చెర్ టైమ్ అంటూ ఐస్ ట్యూబ్స్ టబ్ లో కూర్చున్న పిక్ ని షేర్ చేసింది. అయితే సమంత అది షూటింగ్ కోసం చేసిందో లేదంటే ఏదైనా మాయోసైటిస్ థెరపీ చేయించుకుంటుందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతమైతే సమంత ఐస్ ట్యూబ్స్ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరాలయ్యింది. నిజంగానే ఐస్ ట్యూబ్స్ లో కూర్చోవాలంటే టార్చరే కదా..!